version: 3.0
(working title)/ క్షేమంగా ఇంటికి
(Inner Title)
(page 1)
అను ఒక చురుకైన పిల్ల, చాలా ఆటలు ఆడేది.
బొమ్మలు గీసేది. కథలు చదివేది
(page 2)
బొంతలతో కోటలు కట్టేది ఆ కోటలలో బొమ్మలు పెట్టేది
(page 3) ఆ కోటలో తానే రాణి
(page 4)
కానీ కోటలో రాణికి కూడా బోర్ కొడుతుందిగా?
(page 5)
ఎటు చుసినా తాను ఎప్పుడు ఆడే బొమ్మలే,
ఎప్పుడూ కూల్చేసే కోటలే
(page 6)
కిటికీ దగ్గర దిగులుగా కూర్చున్న అనూకి బయట అడవి చాలా అందంగా కనిపించింది
(page 7)
ఒక రోజు ఇంటి గేటు తెరుచుకుని ఉండడం చూసి..
(page 8)
ఎవరికి తెలియకుండా గమ్మున ఇంటి బయటకొచ్చింది
(page 9)
తన చిట్టి సైకిల్ తొక్కుతూ అడవిలోకి బయలుదేరింది
(page 10)
తాను ఎప్పుడూ చూడని ఎన్నో విషయాలు అనూని అబ్బురపరిచాయి.
(page 11)
పురుగులు, కప్పలు,పక్షుల శబ్దాలు చాల వింతగా అనిపించాయి
(page 12)
ఇంకా ఇంకా లోపలికి వెళ్ళింది. పొద్దుగూకుతున్న సంగతి తెలిసేలోపే…
(page 13)
చీకటి చుట్టుముట్టింది, ఇప్పుడు ఏ శబ్దం విన్నా భయం! భయం! భయం!
(page 14)
ఏం చెయ్యాలో తెలీక ఏడుపు వచ్చింది, భోరున పెద్దగా ఏడ్చింది
(page 15)
అంత చీకట్లో దూరంగా తనవైపుగా కదలివస్తూ ఒక చిన్ని దీపం కనిపించింది.
“ఎవరది?” అని అడిగింది అను భయంగా.
(page 16)
“ఎందుకలా ఏడుస్తున్నావ్?” అని గొంతు వినిపించింది. అది దీపం కాదు, ఒక మిణుగురు పురుగు!
(page 17)
“అడవి చూడడానికి వచ్చాను… చీకటి పడింది…నాకు భయం వేస్తోంది” అంది, మళ్లీ ఏడుపు లంకించుకుంది.
(page 18)
“భయపడకు.. నాతో రా!” అని తన వెనకాలే తీసుకుపోయింది ఆ మిణుగురు.
(page 19)
ఈ చెట్టు ఆ చెట్టు తిరిగారు. చూస్తూ చూస్తూనే, ఒక్కొక్కటిగా, వందలకొద్దీ మిణుగురులు ఎక్కడెక్కడినుంచో వచ్చి పెద్ద గుంపుగా ఏర్పడి పెద్ద వెలుతురు లా ఎగురుకుంటూ వచ్చాయి. అను, తన నేస్తం మిణుగురు ఆ వెలుతురు మధ్యలోకి వచ్చేసారు!
అను భయం మర్చిపోయింది!
(page 20)
మిణుగురు పురుగుల కాంతిలో ఆ అడివి వెలిగిపోయింది.
అవి అనుకి రాత్రి అడవి అంతా చూపించాయి.
చీకట్లో దాక్కున్న చాలా జంతువులు బయటకి వచ్చాయి.
అనుని పలకరించాయి.
(page 21)
“అడవి రాత్రి కూడా బాగుంటుంది” అంది మిణుగురు పురుగు.
‘అవును’అని నవ్వుతూ తలూపింది అను.
మిణుగురు పురుగులు ఇంటికి దారి చూపించాయి,
అను సైకిల్ తొక్కుతూ అడవి బయటకు వచ్చింది
(page 22) రాత్రంటే భయం పోయింది అనుకి. క్షేమంగా ఇంటికి చేరింది.
(End)